WHO: క్యాన్సర్‌ కేసులపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!

2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసుల సంఖ్య 77శాతం పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

Published : 02 Feb 2024 01:52 IST

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కి చెందిన ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (IARC) కీలక హెచ్చరికలు జారీ చేసింది. 2022 నాటికి ప్రపంచంలో 20 మిలియన్ల కేసులు నమోదు కాగా.. 2050 ఏళ్లనాటికి కొత్తగా మరో 35 మిలియన్ల మందికి ఈ మహమ్మారి సోకే అవకాముందని అంచనా వేసింది. ఈ మేరకు తమ పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొంది. 2022తో పోల్చితే 77శాతం కొత్త కేసులు నమోదవుతాయని తెలిపింది.  దీనికి పొగాకు, మద్యం, ఊబకాయం, వాయుకాలుష్యమే ప్రధాన కారణాలుగా పేర్కొంది. దీని ప్రభావం జనాభా పెరుగుదల, వృద్ధాప్యంపైనా పడుతుందని చెప్పిన IARC.. అభివృద్ధి చెందిన దేశాల్లో మరింత ప్రభావం ఉంటుందని తెలిపింది.ఈ దేశాల్లో 2022 లెక్కలతో పోలిస్తే.. అదనంగా 4.8 మిలియన్ల కేసులు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని