Chile: హెలికాప్టర్‌ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు మృతి

చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినేరా హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో మృతి చెందారు.   

Updated : 07 Feb 2024 06:44 IST

చీలి: హెలికాప్టర్‌ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినేరా (74) మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో పినేరా ప్రయాణిస్తుండగా అది కూలిపోయింది. దీంతో ఆయన మృతిచెందగా, మిగతావారు గాయాలతో బయటపడ్డారు. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన పినేరా మొదట 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు చిలీ దేశాధ్యక్షుడిగా ఉన్నారు. బిలియనీర్‌ అయిన ఆయన చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని