Abdul Rauf Azhar: పాక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ను కాపాడిన చైనా..!

జైషే ఉగ్రసంస్థ కీలక నాయకుడిని చైనా వెనకేసుకొచ్చింది. పాక్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ చేసిన ప్రతిపాదనను బీజింగ్‌ అడ్డుకొంది. 

Published : 11 May 2023 15:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌(Pakistan) కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ అజర్‌(Abdul Rauf Azhar)ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలంటూ భారత్‌ ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా(China) అడ్డుకొంది. ఐరాస(UN) భద్రతా మండలి ‘1267 ఐఎస్‌ఐఎల్‌, అల్‌ఖైదా ఆంక్షల జాబితా’ కింద భారత్‌ తీర్మానానికి అడ్డుపుల్ల వేసింది. గతంలో కూడా పాక్‌ ఉగ్రవాదులపై ఐరాస ఆంక్షలు విధించకుండా అడ్డుకొన్న చరిత్ర చైనాకు ఉంది.  రవూఫ్‌ గతంలో భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు.  1999లో జరిగిన ఐసీ814 విమాన హైజాక్‌లో కూడా ఇతన హస్తం ఉంది. దీంతోపాటు 2001లో జరిగిన పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్‌ కోట్‌ దాడి వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్‌ ప్రమేయం ఉంది. ఇతడిపై అమెరికా 2010 డిసెంబర్‌ నుంచే ఆంక్షలు విధించింది. 

గతేడాది ఆగస్టులో కూడా రవూఫ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా నిలిపివేసింది. అంతేకాదు పాక్‌కు చెందిన హఫీజ్‌ తలాహ్‌ సయీద్‌, షాహిద్‌ మహమ్మద్‌, సాజిద్‌ మిర్‌లపై ఐరాస ఆంక్షలు విధించకుండా కాపాడింది. 2022 జూన్‌లో పాక్‌కు చెందిన లష్కరే  ఉగ్రసంస్థకు చెందిన అబ్దుల్‌ రహ్మాన్‌ మక్కీపై ఆంక్షల ప్రతిపాదనను అడ్డుకొంది. కానీ, భారత్‌, అమెరికా తీవ్రంగా ప్రయత్నించడంతో ఐరాస ఈ ఏడాది జనవరిలో మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇరు దేశాల ఒత్తిడికి చైనా తలొగ్గింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని