China: 2035 నాటికి చైనా వద్ద 1,500 అణ్వస్త్రాలు..!
చైనా అణ్వస్త్రాల సంఖ్యను భారీగా పెంచేస్తోందని అమెరికా అంటోంది. 2035 నాటికి ప్రస్తుతం ఉన్న వాటి కంటే మూడురెట్లు అధికంగా అణువార్ హెడ్లు చైనా వద్ద ఉంటాయని పేర్కొంది.
ఇంటర్నెట్‌డెస్క్: చైనా అణ్వస్త్రాల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోందని అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. ఈ మేరకు పెంటగాన్ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇప్పటికే చైనా 400 అణువార్ హెడ్లను తయారు చేసిందని దానిలో పేర్కొంది. 2035 నాటికి అణ్వస్త్రాల సంఖ్య మూడు రెట్లకుపైగా పెరిగి 1,500కు చేరుతుందని విశ్లేషించింది. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేలా చైనా సిద్ధమవుతుందని అభిప్రాయపడింది. 2035 నాటికి తన సైన్యం, సాయుధ దళాల ఆధునికీకరణను చైనా పూర్తిచేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆ నివేదిక తెలిపింది. పెంటగాన్ నివేదిక ప్రకారం చైనాకు దాదాపు 10లక్షల మంది సైనికులు, ప్రపంచంలోనే అతిపెద్ద నావికాదళం, మూడో అతిపెద్ద వాయు సేన ఉన్నాయని ఆ నివేదిక చెప్పింది.
భారత్‌తో సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా హెచ్చరించినట్లు పెంటగాన్ నివేదికలో వెల్లడించింది. భారత్-అమెరికా సన్నిహిత సంబంధాల కారణంగా వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు పెరగడానికి కారణం కావడాన్ని నివారించాలని చైనా కోరింది. 2021 సంవత్సరం మొత్తం చైనా వాస్తవాధీన రేఖ వెంట మోహరింపులు, నిర్మాణాలను కొనసాగించిందని పెంటగాన్ పేర్కొంది. చర్చల్లో పురోగతి నిదానంగా ఉందని అభిప్రాయపడింది. ఇరు పక్షాలు తమ ఆధిపత్యాన్ని వదలుకోవడానికి ఇష్టపడటంలేదని తెలిపింది. ఇరు దేశాలు సైనిక ఉపసంహరణలు జరగాలని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అవి సిద్ధంగా లేవంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్