Japan-China: జపాన్‌ ప్రాదేశిక జలాల్లోకి చైనా గస్తీ నౌకలు

చైనా, జపాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరుదేశాల సరిహద్దులో ఉన్న డియాయు ద్వీపం ప్రాదేశిక జలాల్లో గస్తీ నిర్వహించినట్లు చైనా కోస్టుగార్డు వెల్లడించింది.

Published : 12 Jan 2024 02:10 IST

బీజింగ్‌: చైనా, జపాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరుదేశాల సరిహద్దులో ఉన్న డియాయు ద్వీపం ప్రాదేశిక జలాల్లో గస్తీ నిర్వహించినట్లు చైనా కోస్టుగార్డు వెల్లడించింది. తూర్పు చైనా సముద్ర ద్వీపాలపై ఇరుదేశాల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. వీటిని తమవంటే తమవని ఇరుదేశాలు చెబుతుంటాయి. వీటిని సెంకాకు దీవులు అని కూడా పిలుస్తారు. తాజా పరిణామంపై జపాన్‌ కోస్టు గార్డు కూడా ప్రకటన విడుదల చేసింది. తమదేశ ప్రాదేశిక జలాల నుంచి వెళ్లిపోవాల్సిందిగా చైనాను పలుమార్లు కోరినట్లు తెలిపింది. దాదాపు రెండు గంటల తర్వాత చైనాకు చెందిన 4 గస్తీ నౌకలు దక్షిణ దిశగా వెళ్లిపోయినట్లు పేర్కొంది. డిసెంబర్‌ 18 తర్వాత తమ ప్రాదేశిక జలాల్లోకి చైనా నౌకలు ప్రవేశించడం ఇదే తొలిసారని జపాన్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు