Mette Frederiksen: డెన్మార్క్‌లో అనూహ్య ఘటన.. ఏకంగా ప్రధానిపైనే దాడి

డెన్మార్క్‌ (Denmark) ప్రధాన మంత్రి మెటె ఫ్రెడ్రిక్సన్‌(Mette Frederiksen)పై దాడి జరగడం కలకలం సృష్టించింది. ఆమె ప్రస్తుత పరిస్థితి గురించి ప్రకటన రావాల్సి ఉంది. 

Published : 08 Jun 2024 11:57 IST

కోపెన్‌హాగెన్: ఐరోపా దేశం డెన్మార్క్‌ (Denmark) ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ (Mette Frederiksen)పై దాడి జరిగింది. ఏకంగా ప్రధానిపైనే దాడి జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌లో ఒక దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

‘‘కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్‌వెట్‌ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురయ్యారు’’ అని ఫ్రెడ్రిక్సన్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాంతో భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి  సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్‌కు ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కొద్దివారాల క్రితం స్లొవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికోపై ఒక దుండగుడు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని