Canada: కెనడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 10 Feb 2024 18:18 IST

ఒట్టావా: కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు దుర్మరణం చెందారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. చండీగఢ్‌కు చెందిన రీతిక్‌ ఛబ్రా(23) తన సోదరుడు రోహన్‌ (22) ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లారు. వీరికి సెనెకా కాలేజీలో పుణెకు చెందిన గౌరవ్ (24)తో పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురు ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

రీతిక్‌ పుట్టిన రోజు వేడుక జరిపేందుకు వెళ్లిన వీరు రాత్రి ఆలస్యంగా తమ కారులో తిరిగి వస్తున్నారు. వేగంగా డ్రైవింగ్‌ చేయడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వేరే కారుతో పోటీ పడటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని