Russia: రష్యా ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ల దాడి.. దెబ్బతిన్న నాలుగు విమానాలు

రష్యా భూభాగంలో మరోసారి డ్రోన్ల దాడి కలకలం రేపింది. వాయువ్య ప్రాంతంలోని ఎయిర్‌పోర్ట్‌లో డ్రోన్లు దాడికి దిగడంతో నాలుగు రవాణా విమానాలు దెబ్బతిన్నట్లు స్థానిక అధికార వర్గాలు వెల్లడించాయి.

Updated : 30 Aug 2023 05:37 IST

మాస్కో: రష్యా వాయువ్య ప్రాంతంలోని పొస్కోవ్‌ నగరంలో ఎయిర్‌పోర్టుపై బుధవారం తెల్లవారుజామున డ్రోన్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో నాలుగు రవాణా విమానాలు దెబ్బతిన్నాయి. దీంతో రష్యా ఆర్మీ డ్రోన్లపై ఎదురుదాడికి దిగింది. స్థానిక గవర్నర్‌ మిఖాయిల్‌ వెడెర్నికోవ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దాడిలో భాగంగా నాలుగు ఇల్యూషిన్‌-76 విమానాలు దెబ్బతిన్నాయని, డ్రోన్ల దాడి సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు రష్యా మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పోస్కోవ్‌ నగరం ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి 600 కి.మీల దూరంలో ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని స్థానిక అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడి ఘటనపై ఉక్రెయిన్‌ స్పందించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానిక గవర్నర్‌ టెలిగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని