Viral video: పర్యటకుల ట్రక్కును ఎత్తి పడేసిన ఏనుగు.. వీడియో వైరల్‌

జంతువులను దగ్గర నుంచి చూడాలనుకునే పర్యాటకులకు వింత అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Published : 23 Mar 2024 00:07 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: జంతువులను దగ్గరనుంచి చూడాలనుకునే పర్యటకులకు అప్పుడప్పుడు వింత అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.  

అసలేం జరిగిందంటే.. దక్షిణాఫ్రికాలోని పిలానెస్‌ నేషనల్‌ పార్కులో జంతువులను దగ్గరినుంచి చూసేందుకు పర్యటకులకు సఫారీ ట్రక్కులను ఏర్పాటు చేశారు. కొంతమంది పర్యటకులు ఆ ట్రక్కులో జంతువులను దగ్గరగా చూసేందుకు బయల్దేరారు. ఈక్రమంలో ఓ ఏనుగు వద్దకు వెళ్లగానే వారంతా పెద్దపెద్ద అరుపులతో కేకలు వేశారు. కోపంతో ఉన్న ఆ ఏనుగు ట్రక్కు వద్దకు వచ్చి తన తొండంతో పలుమార్లు ఎత్తి కింద పడేసింది. దీంతో పర్యటకులు భయపడి సీట్ల కింద దాక్కున్నారు. డ్రైవర్‌ ధైర్యం చేసి ఏనుగును వెళ్లగొట్టడానికి ప్రయత్నించగా, కొంతసేపటి తరువాత ఏనుగు ఆ వాహనాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో అక్కడివారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో నేషనల్ పార్క్ లోపల ఉన్న హెండ్రీ బ్లోమ్ అనే వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాలలో వైరలవుతోంది. 

ఈ వీడియోకి సంబంధించి కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘వారు నిజంగా చనిపోతారనుకున్నాం’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘పర్య టకులు ఫొటోలు తీయాలనుకున్నారు. అందుకే ఏనుగు చాలా దగ్గరికి వచ్చింద’ని మరొకరు కామెంట్‌ చేశారు. ట్రక్కు డ్రైవర్‌ అక్కడి పరిస్థితిని హ్యాండిల్ చేసిన తీరును అందరూ అభినందిస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పార్కు అధికారులు తెలిపారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు