Elon Musk: అలా చేస్తే మా కంపెనీలో యాపిల్‌ ఉత్పత్తులపై నిషేధం : ఎలాన్ మస్క్

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యాపిల్‌ తమ పరికరాల్లో ఏఐ రూపొందించిన కృత్రిమ మేధను ఉపయోగిస్తే తమ కంపెనీలో యాపిల్‌ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు.

Updated : 11 Jun 2024 18:47 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: యాపిల్‌(Apple) పరికరాలకు ఏఐ(OpenAI) రూపొందించిన కృత్రిమ మేధను అనుసంధానిస్తే తమ కంపెనీలో వాటిని నిషేధిస్తామని టెస్లా (సీఈఓ)CEO ఎలాన్ మస్క్(Elon Musk) పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యాపిల్‌ తాజాగా ‘వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌’ను నిర్వహించింది. ఈ వార్షిక సమావేశంలో సంస్థ తమ ఉత్పత్తులకు తీసుకురానున్న అప్‌గ్రేడ్‌లను ఆవిష్కరించింది. ఇందులోభాగంగా iOS 18 సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లో కృత్రిమమేధను జోడిస్తున్నట్లు వెల్లడించింది. యాపిల్‌ చాట్‌బాట్‌ పరికరాల్లో చాట్‌జీపీటీ (ChatGPT)ని అనుసంధానించడానికి ఓపెన్ ఏఐ(OpenAI)తో ఒప్పందం చేసుకుంటామని వెల్లడించింది.

ఎలాన్‌ మస్క్ దీనిపై స్పందిస్తూ ఐఫోన్ ఓఎస్‌(OS)కి ఓపెన్‌ ఏఐను అనుసంధానిస్తే తన కంపెనీ పరికరాలను ఇకపై అనుమతించబోమని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇటువంటి స్పైవేర్‌ను ఆపేయకపోతే తమ కంపెనీల్లో అన్ని యాపిల్‌ పరికరాల పైన నిషేధం విధిస్తామని తెలిపారు.  సంస్థలో యాపిల్‌కు సంబంధించిన పరికరాలను ఇకపై ఉపయోగించమన్నారు. 

అనంతరం ఆయన మరో పోస్టులో యాపిల్ సంస్థకు సొంతంగా ఓపెన్‌ ఏఐని తయారుచేసుకునే సామర్థ్యం లేదని అనుకోవట్లేదన్నారు. సొంత ఏఐతో భద్రత, గోప్యత ఉంటుందన్నారు. అలాకాకుండా డేటాను ఓపెన్‌ ఏఐ అందజేస్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యాపిల్‌ తన పరికరాల్లో చాట్‌ జీపీటీని అనుసంధానించడం వల్ల వినియోగదారుల డేటా గోప్యతకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట్లో చర్చ నెలకొంది. నెటిజన్లు స్పందిస్తూ ఏఐతో అనుసంధానించడం వల్ల యాపిల్‌ సంస్థ ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని