Istanbul: ఇస్తాంబుల్‌ నైట్‌ క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 29 మంది మృతి

ఇస్తాంబుల్‌లో ఓ నైట్‌ క్లబ్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం (Fire Accident)లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 02 Apr 2024 21:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తుర్కియేలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. నైట్‌ క్లబ్‌లో జరిగిన ఈ ఘటనలో దాదాపు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బెసిక్తాస్‌ జిల్లా గేరెట్టేపే ప్రాంతంలోని ఓ 16 అంతస్తుల భవనం బేస్‌మెంట్‌లో నైట్‌ క్లబ్‌ ఉంది. ఇటీవల దీనికి మరమ్మతులు చేపట్టారు. ఇవి కొనసాగుతోన్న సమయంలో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితుల్లో ఎక్కువమంది క్లబ్‌ నిర్మాణపనుల్లో ఉన్నవారేనని సమాచారం. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. క్లబ్‌ మేనేజర్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని