Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్‌..!

వృద్ధ దంపతులు తమ ఇంటి పెరట్లో ఓ క్రియాశీల బాంబుతో కాలం వెళ్లదీసిన ఘటన బ్రిటన్‌లో వెలుగుచూసింది.

Published : 05 Dec 2023 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏకంగా ఓ బాంబునే తమ ఇంటి పెరట్లో పెట్టుకున్నారు ఓ వృద్ధ దంపతులు. తీరా.. అది క్రియాశీల పేలుడు పదార్థమని తెలియడంతో నివ్వెరపోయారు! బ్రిటన్‌ (Britain)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పెమ్‌బ్రూక్‌షైర్‌కు చెందిన సియాన్‌, జెఫ్రీ ఎడ్వర్డ్స్‌ దంపతుల ఇంటి పెరట్లో చాలా కాలంగా ఓ బాంబు షెల్‌ ఉంది. అయితే.. ఆ దంపతులు దాన్ని డమ్మీ బాంబు (Dummy Bomb)గా భావించి, తేలికగా తీసుకునేవారు. తోటపని తర్వాత మట్టి అంటుకున్న పనిముట్లను దానికే కొడుతూ శుభ్రపరిచేవారు. ఈ క్రమంలోనే స్థానిక పోలీసులు ఇటీవల ఆ బాంబును గుర్తించారు.

ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది పర్వతారోహకుల మృతి

వెంటనే రక్షణశాఖకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌ బృందం.. ఆ వస్తువును జాగ్రత్తగా అక్కడినుంచి దూరంగా తరలించింది. ఓ ప్రదేశంలో ఐదు టన్నుల ఇసుకతో పూడ్చిపెట్టి, సురక్షితంగా పేల్చేసింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బాంబును 19 శతాబ్దం చివరినాటిదిగా భావిస్తున్నారు. బ్రిటన్‌ ‘రాయల్‌ నేవీ’ ఈ ప్రాంతంలో యుద్ధ అభ్యాసాలు చేసేదని తేలింది. ‘అది క్రియాశీలకంగా ఉన్న బాంబు అని తెలియడంతో మేమంతా ఆందోళనకు గురయ్యాం. ఆ రాత్రి కంటి మీద కునుకు లేకుండా పోయింది’ అని ఎడ్వర్డ్స్‌ ఓ వార్తాసంస్థకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు