కాలిఫోర్నియాలో మళ్లీ తుపాకీ కాల్పులు

కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాకీ తూటాలు మరో సారి పేలాయి. ఇక్కడి లాస్‌ఏంజెలెస్‌ సమీప బేవలీ క్రెస్ట్‌లో జరిగిన తుపాకీ దాడిలో ముగ్గురు మరణించగా నలుగురు గాయాలపాలయ్యారు.

Updated : 29 Jan 2023 05:54 IST

ముగ్గురి మృతి, నలుగురికి గాయాలు

బేవలీ క్రెస్ట్‌: కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాకీ తూటాలు మరో సారి పేలాయి. ఇక్కడి లాస్‌ఏంజెలెస్‌ సమీప బేవలీ క్రెస్ట్‌లో జరిగిన తుపాకీ దాడిలో ముగ్గురు మరణించగా నలుగురు గాయాలపాలయ్యారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఒక అద్దె ఇంట్లో (షార్ట్‌ టెర్మ్‌ రెంటల్‌ హోమ్‌) ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన ముగ్గురూ వాహనంలో ఉండగా.. గాయపడిన నలుగురూ బయట ఉన్నారని వివరించారు. ఆ అద్దె ఇంట్లో ఏమైనా పార్టీ జరిగిందా, అది ఎలాంటి పార్టీ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఏడుగురి వివరాలనూ వారు బయటపెట్టలేదు. కాలిఫోర్నియా రాష్ట్రంలో.. నెల రోజుల వ్యవధిలో ఇది నాలుగో తుపాకీ కాల్పుల ఘటన కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని