ఆసుపత్రిపై ఉక్రెయిన్ రాకెట్ దాడి.. 14 మంది మృతి
లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లోని ఓ ఆసుపత్రిపై ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో 14 మంది మృతి చెందారని రష్యా రక్షణశాఖ శనివారం తెలిపింది.
మాస్కో: లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లోని ఓ ఆసుపత్రిపై ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో 14 మంది మృతి చెందారని రష్యా రక్షణశాఖ శనివారం తెలిపింది. అమెరికాలో తయారైన హిమార్స్ రాకెట్ లాంఛర్లతో ఈ దాడి జరిపినట్లు వెల్లడించింది. భారీస్థాయి పేలుడు పదార్థాలున్న రాకెట్లను ఉపయోగించడంతో రోగులు, వైద్య సిబ్బందిలో మరో 24 మంది గాయపడ్డారని తెలిపింది.
మూడో ప్రపంచ యుద్ధం వస్తే మిగిలేది బూడిదే: మెద్వదేవ్
మూడో ప్రపంచ యుద్ధమనేది వస్తే అది యుద్ధట్యాంకులతోనో, విమానాలతోనో మొదలు కాదనీ, చివరకు మిగిలేది బూడిదే అని రష్యా భద్రత మండలి డిప్యూటీ ఛైర్మన్ మెద్వెదేవ్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాలు తమ చర్యను సమర్థించుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు శనివారం టెలిగ్రాం ఛానల్లో ఆయన రాసుకొచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్