ఆస్ట్రేలియాలో రేడియోధార్మిక క్యాప్సూల్ గల్లంతు
ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన ఓ చిన్న క్యాప్సూల్.. అక్కడి అధికారులను హడలెత్తిస్తోంది! అందులో రేడియోధార్మిక పదార్థం ‘సీజియం- 137 ఉండటమే ఇందుకు కారణం.
1400 కి.మీల మేర గాలింపు
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన ఓ చిన్న క్యాప్సూల్.. అక్కడి అధికారులను హడలెత్తిస్తోంది! అందులో రేడియోధార్మిక పదార్థం ‘సీజియం- 137 ఉండటమే ఇందుకు కారణం. ఆ గుళికను తాకడం లేదా దగ్గర ఉంచుకోవడం తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వస్తువు ఏదైనా కనిపిస్తే దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
6 మి.మీల వ్యాసం, 8 మి.మీల పొడవు గల ఈ క్యాప్సూల్‌ను ఇటీవల ఓ ట్రక్కులో పశ్చిమ ఆస్ట్రేలియా న్యూమన్ ఉత్తర ప్రాంతం నుంచి పెర్త్‌కు రవాణా చేస్తుండగా.. మార్గమధ్యలో ఎక్కడో పడిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 1400 కి.మీల మేర వెతుకులాట కొనసాగిస్తున్నారు.
సీజియం- 137ను మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు. అది రేడియేషన్‌ను విడుదల చేస్తుందని, దాన్ని తాకిన, లేదా వెంట ఉంచుకున్న వారికి కాలిన గాయాలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అత్యవసర సేవల విభాగం హెచ్చరించింది. ఆ క్యాప్సూల్ ఫొటోను విడుదల చేసింది. ఎవరికైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
India News
ChatGPT: భారత్ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!
-
Sports News
Labuschagne:ఐపీఎల్లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!
-
Politics News
Arvind Kejriwal: బాబోయ్ మీకో నమస్కారం.. అంతా మీ దయ వల్లే జరిగింది: భాజపాకు కేజ్రీవాల్ కౌంటర్
-
World News
Japan: పితృత్వ సెలవులు ఇస్తామంటే.. భయపడిపోతున్న తండ్రులు