US green card: భారతీయులకు సత్వర గ్రీన్‌కార్డుల కోసం సిఫార్సు
ఈబీ 1, 2, 3 కేటగిరీల్లో ఐ140 వీసా పిటిషన్లకు ఆమోదముద్ర పడినవారికి ఉద్యోగ సమ్మతి పత్రాలను, ప్రయాణ పత్రాలను ఇచ్చే అంశంపై అమెరికా అధ్యక్షుడి సలహా సంఘం ఒకటి చర్చించింది.
వాషింగ్టన్: ఈబీ 1, 2, 3 కేటగిరీల్లో ఐ140 వీసా పిటిషన్లకు ఆమోదముద్ర పడినవారికి ఉద్యోగ సమ్మతి పత్రాలను, ప్రయాణ పత్రాలను ఇచ్చే అంశంపై అమెరికా అధ్యక్షుడి సలహా సంఘం ఒకటి చర్చించింది. ఆసియన్ అమెరికన్లు, హవాయి, పసిఫిక్ ద్వీప వాసులకు ప్రాతినిధ్యం వహించే ఈ సలహా సంఘ సిఫార్సును అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదిస్తే విదేశీ నిపుణులకు అమెరికాలో శాశ్వతనివాస కార్డు (గ్రీన్ కార్డు) కోసం నిరీక్షణ వ్యవధి బాగా తగ్గిపోతుంది. అయిదేళ్ల నుంచి ఈ తరహా వీసా అనుమతి కోసం ఎదురుచూస్తున్నవారికీ ఉద్యోగ సమ్మతి పత్రాలను, ప్రయాణ పత్రాలను ఇవ్వాలని సిఫార్సు చేశారు. సంఘంలోని భారతీయ అమెరికన్ సభ్యుడు అజయ్‌జైన్ భుటోడియా అమెరికాలో హెచ్1బీ వీసాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వీరికి త్వరగా గ్రీన్‌కార్డులు ఇస్తే ప్రపంచమంతటి నుంచి సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితాల్లో నిష్ణాతులైనవారిని, వైద్యులను అమెరికా పెద్దఎత్తున ఆకర్షించగలుగుతుందన్నారు. వీరి వల్ల అమెరికా ఆర్థికాభివృద్ధికి గొప్ప ఊతం లభిస్తుందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
World News
నీటి లోపల వంద రోజులు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం!
-
Crime News
Vijayawada: విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Rains: మూడు రోజులు తేలికపాటి వర్షాలు
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు