ఢాకాలో ఘోర బస్సు ప్రమాదం

బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగబంధు ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న బస్సు టైరు పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 19 మంది మృతిచెందారు.

Published : 20 Mar 2023 04:57 IST

కాల్వలోకి దూసుకెళ్లి.. 19 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగబంధు ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న బస్సు టైరు పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 19 మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. దాదాపు 50 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు ఇక్కడి సోనాదంగా నుంచి ఢాకాకు బయల్దేరింది. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో మార్గమధ్యంలోని మదారీపుర్‌ వద్ద బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఎండీ మసూద్‌ ఆలం తెలిపారు. 30 అడుగుల లోతు గుంతలోకి పడ్డ బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకొని, సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడినవారిని ఢాకా వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని