Tourist Visa: పర్యాటక వీసాతోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు
పర్యాటక, వ్యాపార వీసాలతో అమెరికాకు వచ్చినవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని అమెరికా తీపి కబురు అందించింది.
ఇంటర్వ్యూలకూ హాజరు కావొచ్చు
కానీ ఉద్యోగంలో చేరేముందు వీసా మార్చుకోవాలి: అమెరికా వెల్లడి
వాషింగ్టన్: పర్యాటక, వ్యాపార వీసాలతో అమెరికాకు వచ్చినవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని అమెరికా తీపి కబురు అందించింది. ఉద్యోగంలో చేరేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బీ1 వీసాను వ్యాపార పనుల మీద వచ్చిన వారికి, బీ2 వీసాను పర్యాటకులకు అమెరికా జారీ చేస్తుంటుంది. ఆ దేశ తాజా నిర్ణయంతో ఈ రెండు వీసాల కేటగిరీలవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికా వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) బుధవారం ఈ వివరాలను వెల్లడించింది. టెక్ అగ్ర సంస్థల్లో ఇటీవల భారీగా ఉద్యోగాల కోతతో వేలాది మంది విదేశీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నవారు 60 రోజుల వ్యవధిలో మరో ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. వీరు అప్పటికే ఉద్యోగం సంపాదిస్తే అమెరికాలో ఉండవచ్చు. లేదంటే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ఆందోళనల నడుమ.. ఉద్యోగం వెతుక్కునేందుకు వేర్వేరు మార్గాలు ఉన్నాయంటూ బుధవారం టూరిస్టు, బిజినెస్ వీసాలకు సంబంధించి యూఎస్‌సీఐఎస్ వరుస ట్వీట్లు చేసింది. ‘60 రోజుల్లో ఉద్యోగం రానివారు దేశం విడిచి వెళ్లాలన్న అంశాన్ని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, వారికి అనేక మార్గాలున్నాయని పేర్కొంది. ‘హెచ్1బీ వీసా ఉన్నవారు ఉద్యోగం కోల్పోయినా వారికి పలు అవకాశాలున్నాయి. ఆ వీసాను మార్చుకోవడం, హోదాను సర్దుబాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవడం, సరైన కారణాలు చూపుతూ ఉద్యోగం మారేందుకు పాత యజమాన్య సంస్థను వదిలేస్తున్నానని దరఖాస్తు చేసుకోవడం వంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి దరఖాస్తులను 60 రోజుల్లోగా చేసుకుని ఉంటే హెచ్1బీ వీసాలున్నవారు ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో ఉండవచ్చు. చాలామంది బీ1, బీ2 వీసాలుంటే ఉద్యోగం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. దీనికి మా సమాధానం అవును అనే. బీ1, బీ2తో ఉద్యోగాలను వెతుక్కోవడానికి అనుమతి ఉంది’ అని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. బీ1, బీ2తో ఉద్యోగాలను వెతుక్కున్నవారు ఉద్యోగంలో చేరేముందే ఉద్యోగ వీసాకు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
General News
TSPSC Paper Leak Case: సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం.. ఐటీ ఉద్యోగి అరెస్టు
-
World News
Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్.. కలవరపెడుతున్న మరణాలు
-
Politics News
PM Modi: భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో అధిష్ఠానం కీలక భేటీ
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు