వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు

ఓ మహిళ తన 14 ఏళ్ల కుమారుడికి బూట్లు కొనడం కోసం ప్రపంచమంతా వెతికినా ఫలితం దక్కలేదు. అతడికి కావాల్సిన బూట్ల సైజు 23. బూట్ల తయారీ సంస్థలను సంప్రదించినా.

Published : 28 Mar 2023 05:24 IST

మహిళ తన 14 ఏళ్ల కుమారుడికి బూట్లు కొనడం కోసం ప్రపంచమంతా వెతికినా ఫలితం దక్కలేదు. అతడికి కావాల్సిన బూట్ల సైజు 23. బూట్ల తయారీ సంస్థలను సంప్రదించినా.. ఈ సైజులో తయారు చేయలేమని చేతులెత్తేశాయి. అమెరికాలోని మిషిగన్‌కు చెందిన ఎరిక్‌ జూనియర్‌ అనే కుర్రాడి తల్లికి ఎదురైన పరిస్థితి ఇది. ఎరిక్‌ 14 ఏళ్ల వయసులోనే ఆరు అడుగుల పది అంగుళాల ఎత్తు పెరిగాడు. పుట్టినప్పుడే అతడి పాదాలు కాస్త పెద్దగా ఉండేవి. అవి అసాధారణ రీతిలో పెరుగుతూ వస్తున్నాయి. ఏడో తరగతికి వచ్చేసరికి అతడి బూట్ల సైజు 17కు చేరింది. అప్పట్నుంచి అతడి పాదాలకు సరిపోయే బూట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. సరిపోని బూట్లు ధరించడం వల్ల ఎరిక్‌ కాళ్లకు బొబ్బలు రావడంతోపాటు అందరు పిల్లల్లా ఆటలు ఆడలేకపోయేవాడు. అతడి పాదాలకు సరిపోయే సైజు షూల కోసం ఎరిక్‌ తల్లి ఎన్ని షాపులు తిరిగినా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఎరిక్‌ 22 సైజ్‌ బూట్లనే కష్టంగా వాడుతున్నాడు. అవి కూడా అతని కుటుంబ స్నేహితురాలికి నైకీ సంస్థకు చెందిన ఓ షాపులో కనిపించాయి. నైకీ సంస్థ గరిష్ఠంగా 18 సైజ్‌ వరకే బూట్లను తయారు చేస్తుంది. అయితే ఓ అథ్లెట్‌ కోసం 22 సైజ్‌ ఉన్న ఓ బూట్ల జతను ప్రత్యేకంగా తయారు చేసింది. ఎరిక్‌ పాదాలు ఇంకా పెరుగుతూ ఉన్నందున 23 సైజ్‌ బూట్లు కూడా సరిపోవని అతడి తల్లి చెబుతోంది. వీరి పరిస్థితిపై స్థానిక మీడియా ప్రసారం చేసిన కథనం వైరల్‌గా మారింది. దీంతో ప్యూమా, అండర్‌ ఆర్మర్‌ సంస్థలు ఎరిక్‌కు సరిపోయే బూట్లను ప్రత్యేకంగా తయారు చేస్తామని ముందుకొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని