Donald Trump: పోర్న్‌స్టార్ వివాదంతో ట్రంప్‌పై కాసుల వర్షం
లైంగిక వేధింపుల కేసు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాసుల వర్షం కురిపిస్తోంది.
24 గంటల్లో రూ.33 కోట్లు
వాషింగ్టన్: లైంగిక వేధింపుల కేసు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాసుల వర్షం కురిపిస్తోంది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ వివాదంలో విచారణకు మన్‌హటన్ గ్రాండ్ జ్యూరీ విచారణకు అనుమతిచ్చిందన్న వార్త వెలువడిన 24 గంటల్లోనే ఆయనపై అభిమానుల్లో సానుభూతి పెరిగింది. విరాళాలు వెల్లువెత్తాయి. 2024 అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ మాజీ అధ్యక్షుడికి 24 గంటల్లోనే 4 మిలియన్ డాలర్ల (రూ.32.87కోట్లు)ను అభిమానులు పంపించారు. ఇందులో 25 శాతానికిపైగా చందాలు.. తొలిసారి విరాళాలు ఇస్తున్న దాతల నుంచే రావడం గమనార్హం. ‘‘అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి విరాళాలు వచ్చాయి. ట్రంప్ ప్రచారానికి వస్తున్న సగటు విరాళాలు 34 డాలర్లే. దీన్ని బట్టి ఎంత మంది సాధారణ ప్రజలు విరాళాలు ఇస్తున్నారో గుర్తించండి. న్యాయవ్యవస్థను ఆయుధంగా వాడుకోవడాన్ని అమెరికన్లు తిరస్కరిస్తున్నారని క్షేత్రస్థాయిలో వస్తున్న విరాళాలను బట్టి తెలుస్తోంది’’ అని ట్రంప్ ప్రచార బృందం ప్రకటన విడుదల చేసింది.
స్మార్ట్ డేనియల్స్‌పై కూడా..
ఈ కేసు నేపథ్యంలో పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ పంట కూడా పండింది. ఆమె ఫొటోలు, సంతకంతో కూడిన మర్చెండైజ్‌ను కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. డేనియల్స్ బికినీ ధరించిన చిత్రంతో పాటు ఆమె సంతకం ఉన్న టీషర్టులకు తెగ ఆర్డర్లు పెడుతున్నారు. ఒక్కో టీషర్ట్‌ను రూ.1600-1700 మధ్య విక్రయిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!