Satya Nadella - Sundar Pichai: కృత్రిమ మేధపై ఆందోళన!.. సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లకు శ్వేతసౌధం పిలుపు

అనూహ్యంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సీఈవోలు సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లను శ్వేత సౌధానికి పిలిపించారు.

Updated : 05 May 2023 11:22 IST

కమలా హారిస్‌తో భేటీ

వాషింగ్టన్‌: అనూహ్యంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సీఈవోలు సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లను శ్వేత సౌధానికి పిలిపించారు. కృత్రిమ మేధపై నియంత్రణలకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు అధ్యక్షుడు బైడెన్‌ సూచన మేరకు వారిని పిలిచినట్లు సమాచారం. ఈ రంగంలో ఆవిష్కరణలకు ముందే అవి సురక్షితమైనవనే భరోసా ఇవ్వాలని బైడెన్‌ ఇటీవల సూచించారు. దీంతో అత్యవసరంగా వారిద్దరినీ పిలిపించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, బైడెన్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జెఫ్‌ జైంట్స్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. చాట్‌జీపీటీ ఓపెన్‌ఏఐ సీఈవో శాం ఆల్ట్‌మన్‌, ఆంథ్రోపిక్‌ సీఈవో డేరియో అమోడీలనూ సమావేశానికి పిలిపించారు. చాట్‌జీపీటీ లాంటి కృత్రిమ మేధ ఆవిష్కరణలు రాత్రికిరాత్రే విజయం సాధించిన నేపథ్యంలో వాటి పర్యవసానాలపై ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని