Covid: కొవిడ్‌ ఇకపై ప్రపంచ విపత్తు కాదు.. కానీ..: డబ్ల్యూహచ్‌వో ప్రకటన

కొవిడ్‌-19 ఇకపై ప్రపంచ విపత్తు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం ప్రకటించింది. ప్రపంచ విపత్తుగా పరిగణించేంతటి స్థాయిలో దాని ప్రభావం లేదని వెల్లడించింది.

Updated : 06 May 2023 08:24 IST

జెనీవా: కొవిడ్‌-19 ఇకపై ప్రపంచ విపత్తు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం ప్రకటించింది. ప్రపంచ విపత్తుగా పరిగణించేంతటి స్థాయిలో దాని ప్రభావం లేదని వెల్లడించింది. గురువారం ఆరోగ్య నిపుణులతో చర్చించిన తర్వాత డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటన చేసింది. అయితే మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని, ఇప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి ముప్పుగా ఉందని తెలిపింది. దాని బారినపడి ప్రతివారం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. ‘‘మన ప్రపంచాన్ని కొవిడ్‌ మళ్లీ ప్రమాదంలో పడేసే పరిస్థితి ఉందా అన్న విషయంపై నిపుణులతో మరోసారి సమీక్ష జరిపించడానికి నేను వెనుకాడను’’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని