బొగ్గులో హైడ్రోజన్‌ నిల్వ.. పర్యావరణహిత ఇంధన వ్యవస్థకు ఊతం

హైడ్రోజన్‌ వాయువును నిల్వ చేయడానికి బొగ్గును ఉపయోగించొచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వినూత్న విధానం ద్వారా బ్యాటరీల తరహాలో భవిష్యత్‌ అవసరాల కోసం శక్తిని భద్రపరచుకోవచ్చని వారు పేర్కొన్నారు.

Published : 28 May 2023 04:37 IST

దిల్లీ: హైడ్రోజన్‌ వాయువును నిల్వ చేయడానికి బొగ్గును ఉపయోగించొచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వినూత్న విధానం ద్వారా బ్యాటరీల తరహాలో భవిష్యత్‌ అవసరాల కోసం శక్తిని భద్రపరచుకోవచ్చని వారు పేర్కొన్నారు.

హైడ్రోజన్‌ అనేది శుద్ధ ఇంధనం. రవాణా, విద్యుదుత్పత్తి, తయారీ వంటి రంగాల్లో దీన్ని వాడొచ్చు. అయితే హైడ్రోజన్‌ సంబంధ మౌలికవసతులను నిర్మించడానికి, దాన్ని చౌకైన, విశ్వసనీయ ఇంధన వనరుగా తీర్చిదిద్దడానికి ఇంకా చాలా కసరత్తు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా హైడ్రోజన్‌ను నిల్వ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంది. ప్రస్తుతం ఇది చాలా ఖరీదైన విధానం. దాని సమర్థత కూడా అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో భౌగోళిక హైడ్రోజన్‌ బ్యాటరీగా బొగ్గు అక్కరకొస్తుందని తాము గుర్తించినట్లు పరిశోధనలో పాలుపంచుకున్న షిమిన్‌ లియు పేర్కొన్నారు. బొగ్గులోకి హైడ్రోజన్‌ను చొప్పించి, నిల్వ చేయవచ్చని ఆయన తెలిపారు. అవసరమైనప్పుడు దాన్ని వెలికితీసి, ఉపయోగించుకోవచ్చన్నారు. ఇందుకోసం సార్పషన్‌ అనే విధానం అక్కరకొస్తుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని