ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా తూనీగలు

రష్యాపై ఎదురుదాడికి మరిన్ని అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధమైంది.

Published : 27 Jul 2023 05:39 IST

ఒక్కో డ్రోన్‌ బరువు 33 గ్రాములే

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాపై ఎదురుదాడికి మరిన్ని అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు 40 కోట్ల డాలర్ల ప్యాకేజీని మంగళవారం వాషింగ్టన్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా తొలిసారి బ్లాక్‌ హార్నెట్‌ నిఘా డ్రోన్లను ఉక్రెయిన్‌కు అందించనుంది. ఇందుకోసం ఏప్రిల్‌లోనే నార్వేకు చెందిన ఎఫ్‌ఎల్‌ఐఆర్‌ అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్స్‌కు 9.3 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టును అమెరికా ఆర్మీ అప్పగించింది. హార్నెట్‌ సిస్టమ్‌లో జాయ్‌స్టిక్‌ వంటి కంట్రోలర్‌, రెండు డ్రోన్లు ఉంటాయి. ఒక్కో డ్రోన్‌ బరువు 33 గ్రాములు. దీంతో సైనికులు వీటిని తేలిగ్గా తమ వెంట తీసుకెళ్లవచ్చు. ఈ డ్రోన్లు 25 నిమిషాలపాటు ప్రయాణించగలవు. గంటకు 28 కి.మీ. వేగంతో వీచే గాలులను తట్టుకొని ఇవి పనిచేయగలవు. శత్రు స్థావరాల్లోకి నిశ్శబ్దంగా ప్రవేశించి తక్కువ రిజల్యూషన్‌ ఉన్న చిత్రాలను, వీడియోలను రెండు కి.మీ. దూరంలోని కంట్రోల్‌ స్టేషన్‌కు పంపించగలవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు