విభేదాలు పరిష్కరించుకోదగ్గవే

అమెరికా, చైనాల మధ్య అత్యున్నత స్థాయి సైనిక సంప్రదింపుల ప్రక్రియను పురుద్ధరించాలని అధ్యక్షులు జో బైడెన్‌, షీ జిన్‌పింగ్‌ నిర్ణయించారు.

Published : 17 Nov 2023 05:29 IST

అమెరికా, చైనా అధ్యక్షుల అభిప్రాయం
సైనిక సంప్రదింపుల పునరుద్ధరణకు నిర్ణయం

వుడ్‌సైడ్‌ (కాలిఫోర్నియా): అమెరికా, చైనాల మధ్య అత్యున్నత స్థాయి సైనిక సంప్రదింపుల ప్రక్రియను పురుద్ధరించాలని అధ్యక్షులు జో బైడెన్‌, షీ జిన్‌పింగ్‌ నిర్ణయించారు. మాదక ద్రవ్యాల నిరోధంలో పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కరించుకోగల స్థాయిలోనే ఉన్నాయని, సంబంధాలు తెగదెంపులు చేసుకునేంత పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీపంలోని వుడ్‌సైడ్‌లో జిన్‌సింగ్‌.. జో బైడెన్‌ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. సుమారు 4 గంటలపాటు జరిగిన వారిద్దరి భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. కలిసి భోజనం చేశారు. అమెరికాతో సంబంధాలను స్థిరీకరించుకోవాలని భేటీ అనంతరం జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు.

ఆయన నియంతే: బైడెన్‌

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నియంతే అని తాను ఇప్పటికీ విశ్వసిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. వీరిద్దరూ బుధవారం సాయంత్రం భేటీ అయిన తరువాత బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని