మరో 11 మంది బందీల విడుదల

ఇజ్రాయెల్‌, హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నాలుగో విడత బందీల విడుదల మంగళవారం ఉదయానికి పూర్తయింది. హమాస్‌ 11 మందిని, ఇజ్రాయెల్‌ 33 మందిని విడుదల చేశాయి.

Updated : 29 Nov 2023 05:37 IST

33 మంది పాలస్తీనీయులకు విముక్తి
కొనసాగుతున్న కాల్పుల విరమణ

జెరూసలెం: ఇజ్రాయెల్‌, హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నాలుగో విడత బందీల విడుదల మంగళవారం ఉదయానికి పూర్తయింది. హమాస్‌ 11 మందిని, ఇజ్రాయెల్‌ 33 మందిని విడుదల చేశాయి. హమాస్‌ విడుదల చేసిన వారంతా పిల్లలు, మహిళలే. వారంతా సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. ఇజ్రాయెల్‌ విడుదల చేసిన పాలస్తీనా ఖైదీలు మంగళవారం ఉదయం తూర్పు జెరూసలెం, రమల్లా చేరుకున్నారు. వారికి పాలస్తీనియులు భారీగా స్వాగతం పలికారు. మరో రెండు రోజులపాటు పొడిగించిన కాల్పుల విరమణ మరింత మంది బందీల విడుదలకు మార్గం సుగమం చేసింది. గాజాలోకి మరింత సాయం అందేందుకు తోడ్పడనుంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ముగియగానే గాజాపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్‌ అంటోంది.

  • దక్షిణ గాజాపై దాడి చేయాలనుకుంటే అక్కడ ఆశ్రయం పొందుతున్న లక్షల మంది ఇబ్బంది పడకుండా చూడాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. వలసలను, పౌర మరణాలను నివారించాల్సిందేనని స్పష్టం చేసింది.
  • గాజాలో 2,34,000 ఇళ్లు దెబ్బతిన్నాయని, అందులో 46,000 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్య సమితి సహాయక సంస్థ వెల్లడించింది. దాదాపు 60 శాతం ఇళ్లు దెబ్బతిన్నట్లేనని పేర్కొంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని