రష్యా సరిహద్దులు పూర్తిగా మూసివేత: ఫిన్లాండ్‌

రష్యాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నట్లు ఫిన్లాండ్‌ ప్రకటించింది. ఇప్పటికే పలు సరిహద్దు దారులను మూసివేసిన ఆ దేశం చివరి రహదారినీ మూసివేయన్నట్లు వెల్లడించింది. వలసలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

Published : 29 Nov 2023 05:58 IST

హెల్సింకీ: రష్యాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నట్లు ఫిన్లాండ్‌ ప్రకటించింది. ఇప్పటికే పలు సరిహద్దు దారులను మూసివేసిన ఆ దేశం చివరి రహదారినీ మూసివేయన్నట్లు వెల్లడించింది. వలసలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రష్యావల్ల తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఫిన్లాండ్‌ ప్రధాని పెట్టెరి ఓర్పో మంగళవారం వెల్లడించారు. ఫిన్లాండ్‌, రష్యా మధ్య 8 సరిహద్దు చెక్‌ పాయింట్లున్నాయి. వాటిలో ఏడింటిని ఇప్పటికే ఫిన్లాండ్‌ మూసివేసింది. చివరి చెక్‌ పాయింట్‌నూ ఇప్పుడు మూసి వేయనున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు