అమెరికాలో పొగమంచు.. ఢీకొట్టుకున్న 30 వాహనాలు

అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఇంటర్‌స్టేట్‌ 86 రహదారిపై సుమారు 30 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు.

Published : 29 Nov 2023 05:59 IST

ఐడహో: అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఇంటర్‌స్టేట్‌ 86 రహదారిపై సుమారు 30 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. పొక్టాటెల్లో విమానాశ్రయం వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో స్వల్పంగా గాయపడిన ఒక వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వాహనాలను పక్కకు తీసి పరిస్థితిని చక్కదిద్దడానికి ఏడు గంటల సమయం పట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని