శ్రీలంక వీసా ఫ్రీ సేవలు ప్రారంభం

భారతీయులతోపాటు 7 దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్‌, చైనా, రష్యా, మలేసియా, జపాన్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజులపాటు పర్యటించవచ్చు.

Updated : 29 Nov 2023 06:27 IST

కొలంబో: భారతీయులతోపాటు 7 దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్‌, చైనా, రష్యా, మలేసియా, జపాన్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజులపాటు పర్యటించవచ్చు. అంటే ముందస్తుగా ఎలాంటి అనుమతి లేకపోయినా నేరుగా టికెట్‌ కొనుక్కుని ఆ దేశానికి వెళ్లి రావొచ్చు. అక్కడి విమానాశ్రయంలో తనిఖీ, పాస్‌పోర్టుపై ఎంట్రీ, ఎగ్జిట్‌ (డ్యూయెల్‌) స్టాంపింగ్‌ మాత్రమే ఉంటుంది. శ్రీలంక వీసా ఫ్రీ సౌకర్యం 2024 మార్చి 31వ తేదీ వరకూ అమల్లో ఉంటుంది. శ్రీలంకకు భారత్‌ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తుంటారు. గత అక్టోబరులో 28,000 మంది భారతీయులు అక్కడ పర్యటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని