అప్పటి వరకూ ఈ ట్యాగ్‌ ధరిస్తా: మస్క్‌

సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్‌కు వచ్చారు.

Updated : 29 Nov 2023 06:26 IST

టెల్‌ అవీవ్‌: సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఓ బందీ తండ్రి ఇచ్చిన మెటల్‌ ట్యాగ్‌ (డాగ్‌ ట్యాగ్‌) స్వీకరించి.. హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు తన మద్దతు ప్రకటించారు. ఈ ట్యాగ్‌ను హమాస్‌వద్ద ఉన్న బందీలంతా విడుదలయ్యే వరకూ ధరిస్తానని చెప్పారు. తన పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు, ప్రధానితో మస్క్‌ సమావేశమయ్యారు. బందీల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని