అయిదు రోజులు నిద్ర లేకుండా లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఆడి.. ప్రాణాలు హరీ

చైనాలో ఓ విద్యార్థి నిద్రాహారాలు మాని లైవ్‌ స్ట్రీమింగులో గేమ్‌ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. హెనాన్స్‌ పింగ్డింగ్షాన్‌ వొకేషనల్‌ అండ్‌ టెక్నికల్‌ కళాశాలలో లీ హావో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

Updated : 29 Nov 2023 06:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలో ఓ విద్యార్థి నిద్రాహారాలు మాని లైవ్‌ స్ట్రీమింగులో గేమ్‌ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. హెనాన్స్‌ పింగ్డింగ్షాన్‌ వొకేషనల్‌ అండ్‌ టెక్నికల్‌ కళాశాలలో లీ హావో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. హెనన్‌లో స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ గేమింగ్‌ సెషన్‌లో చేరాడు. ఇందులో 26 రోజుల్లో 240 గంటలపాటు అతడు లైవ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందుకు కంపెనీ 3 వేల యువాన్ల (రూ.35 వేలకు పైగా) జీతాన్ని ఇస్తుంది. లీ హావోకు రాత్రి షిఫ్ట్‌ కేటాయించగా.. వరుసగా అయిదు రాత్రులు నిద్రపోకుండా లైవ్‌లో పాల్గొని ఆరోగ్యాన్ని నిరక్ష్యం చేశాడు. దీంతో అస్వస్థతకు గురైన లీని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గతంలోనూ 25 రోజుల్లోనే 89 లైవ్‌ సెషన్లను లీ నిర్వహించినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. దీంతో యువకుడి మరణానికి కంపెనీయే కారణమంటూ వచ్చిన ఆరోపణలను సంస్థ తోసిపుచ్చింది. లీకి రావాల్సిన వేతనాన్ని అతడి తండ్రికి అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని