81కి చేరిన బందీల విడుదల

ఇజ్రాయెల్‌, హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్‌, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేశాయి.

Published : 30 Nov 2023 04:34 IST

మొత్తం 180 మంది   పాలస్తీనీయులకు విముక్తి
  ముగిసిన కాల్పుల విరమణ ఒప్పందం

రఫా, జెరూసలెం: ఇజ్రాయెల్‌, హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్‌, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేశాయి. విడుదలైన బందీల్లో 60 మంది ఇజ్రాయెలీలుకాగా.. 19 మంది థాయ్‌లాండ్‌, ఒక్కొక్కరు చొప్పున ఫిలిప్పీన్స్‌, రష్యా వాసులున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు నలుగురు బందీలను హమాస్‌ విడుదల చేసింది. ఒక సైనికురాలిని ఇజ్రాయెల్‌ సైన్యం కాపాడింది. ఇద్దరు బందీలు చనిపోయారు. బుధవారం మరో విడత బందీలు, ఖైదీలు విడుదల కావాల్సి ఉంది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మధ్యవర్తులు రెండు వర్గాలతో మాట్లాడుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలైన సీఐఏ, మొస్సాద్‌ల అధిపతులు విలియం బర్న్స్‌, డేవిడ్‌ బార్నియాలు ఖతార్‌లో కాల్పుల విరమణ పొడిగింపుపై మంగళవారం చర్చలు జరిపారు. బందీల విడుదల ఒప్పందం ఉండాలని వారు కోరుతున్నారు. హమాస్‌ నుంచి ఇంకా స్పందన రాలేదు.

  • మంగళవారం 12 మంది బందీలను హమాస్‌ విడుదల చేసింది. అందులో ఇద్దరు థాయ్‌ జాతీయులున్నారు.  
  • హమాస్‌ నేత యాహ్యా సిన్వర్‌తోపాటు ముఖ్య కమాండర్లు జనంతోపాటు దక్షిణ గాజాకు మారినట్లు సమాచారం. ఒప్పందం ముగిశాక అక్కడా దాడి చేసేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధమవుతోంది.
  • కాల్పుల విరమణతో గాజాలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మానవతా సాయం పంపిణీ పెరుగుతోంది. రోజుకు 160 నుంచి 200 లారీల సాయం గాజాలోకి వస్తోంది. ప్రజలు ఆహారం, ఇంధనం నిల్వ చేసుకునే అవకాశం లభిస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని