ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ

క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది.

Published : 30 Nov 2023 05:14 IST

 చైనా కఠిన నిర్ణయం

బీజింగ్‌: క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. పోరాట సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అథ్లెట్లకు కొద్ది రోజుల పాటు ఈ కఠిన శిక్షణ అందిస్తోంది ఇదివరకు చైనా ఫుట్‌బాల్‌ జట్లు కూడా ఇదే తరహా శిక్షణ పొందాయి. కమ్యూనిస్టు పార్టీ విలువల విస్తృత ప్రచారంలో భాగంగానే ఈ తరహా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయం ఉంది. ప్రస్తుత శిక్షణ కార్యక్రమంలో ఏడేళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు గల అథ్లెట్లు భాగమయ్యారు. షాంఘై నగరంలోని 11 కేంద్రాల్లో 932 మంది అథ్లెట్లు తర్ఫీదు పొందుతున్నారు. ‘వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని పురుషుల జిమ్నాస్టిక్‌ హెడ్‌ కోచ్‌ వెల్లడించారు. జట్లు సమష్టిగా, క్రమశిక్షణతో పనిచేసేందుకు, ఐరన్‌ ఆర్మీని సృష్టించేందుకు ఈ కార్యక్రమం ఉపకరించనుందని వార్తా కథనాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని