కాప్‌ సదస్సుకు గైర్హాజరుకానున్న బైడెన్‌

గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్‌- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు.

Published : 30 Nov 2023 05:17 IST

దుబాయ్‌: గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్‌- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు. అయితే, ఇజ్రాయెల్‌ - హమాస్‌ పోరును ముగింపజేసే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నందున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. తనకు బదులుగా వాతావరణ సమస్యలపై ప్రత్యేక ప్రతినిధి అయిన జాన్‌ కెర్రీని పంపుతున్నారు. శ్వాసకోశ సమస్యల వల్ల పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా రాలేకపోతున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ కూడా హాజరుకాకపోవచ్చు. బ్రిటిష్‌ రాజు ఛార్లెస్‌ సహా పలువురు దేశాధినేతలు పాల్గొనే కాప్‌ సదస్సు భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 సెల్సియస్‌ డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్ష్యసాధనలో ఎంతవరకు వచ్చామో పరిశీలిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు