రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్‌ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్‌ వివేక్‌ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Published : 01 Dec 2023 05:37 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్‌ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్‌ వివేక్‌ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రామస్వామి జాతీయ ఎన్నికల ప్రచార కమిటీ డైరెక్టరు బ్రాయన్‌ స్వెన్సన్‌ గత వారాంతంలో రాజీనామా చేసి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచార కార్యక్రమంలో చేరిపోయారు. రామస్వామి ప్రచార బృందంలో వీడియోగ్రాఫర్‌ అయిన బ్రాండన్‌ గుడ్‌ ఇయర్‌ కూడా ఇప్పటికే దూరమయ్యారు. 21వ శతాబ్దిలో అత్యుత్తమ అధ్యక్షుడిగా ట్రంపును పొగుడుతూనే.. 2024 ఎన్నికల ప్రచారంలో మొదట్లో కాస్త జోరు మీదున్నట్లు కనిపించిన రామస్వామి ప్రచారం ఇప్పుడు వెనుకబడిందనే చెప్పాలి. రిపబ్లికన్‌ పార్టీ నామినేషను కోసం పోటీపడే అభ్యర్థుల మధ్య చర్చల్లోనూ రామస్వామిని ఇతర అభ్యర్థులు లక్ష్యంగా చేసుకొంటున్నారు. ఆయనకు రాజకీయ అనుభవం లేదనీ.. ఇజ్రాయెల్‌, తైవాన్‌ సమస్యలపై వివాదాస్పద వైఖరి తీసుకున్నారనీ విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని