అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్‌ మృతి

ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్‌(100) బుధవారం కనెక్టికట్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు.

Published : 01 Dec 2023 04:21 IST

వాషింగ్టన్‌: ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్‌(100) బుధవారం కనెక్టికట్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అయిన ఆయన అధ్యక్షులు రిచర్డ్‌ నిక్సన్‌, జెరాల్డ్‌ ఫోర్డ్‌ హయాంలో రెండు పర్యాయాలు అమెరికా విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 70వ దశకంలో ముఖ్యంగా నిక్సన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భద్రతా సలహాదారుడిగా, విదేశాంగ మంత్రిగా.. వియత్నాం యుద్ధంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ సంక్షోభాల్లో కిసింజర్‌ ముఖ్య పాత్ర పోషించారు. అదే సమయంలో లక్షలాది పౌరుల మరణాలకు కారణమయ్యారన్న విమర్శలూ ఎదుర్కొన్నారు. కిసింజర్‌ సలహాపై అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ కంబోడియాపై జరిపిన రహస్య బాంబింగ్‌లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని