ఇండోనేసియాలో బద్దలైన అగ్ని పర్వతం

ఇండోనేసియాలో మౌంట్‌ మెరపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు.

Published : 05 Dec 2023 05:03 IST

11 మంది పర్వతారోహకుల మృతి
12 మంది గల్లంతు

పడాంగ్‌: ఇండోనేసియాలో మౌంట్‌ మెరపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. 12 మంది ఆచూకీ గల్లంతైంది. 49 మందిని సహాయక బృందాలు రక్షించాయి. పశ్చిమ సమత్రా దీవిలోని ఈ మౌంట్‌ మెరపి ఆదివారం విస్ఫోటనం చెందింది. దీంతో మూడు వేల మీటర్ల ఎత్తుకు బూడిద వ్యాపించింది. ‘‘అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు మా వద్ద సమాచారం ఉంది. 49 మందిని కాపాడాం. 11 మంది మరణించారు. మరో 12 మంది ఆచూకీ తెలియాల్సివుంది. కాపాడిన వారిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి’’ అని పడాంగ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్‌ మాలిక్‌ తెలిపారు. ఇండోనేషియాలోని మౌంట్‌ మెరపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారాంతం కావడంతో పర్వతారోహకులు ట్రెక్కింగ్‌ చేసే సమయంలో అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని