ఐదు మృతదేహాలతో ఓస్ప్రే విమాన శకలం లభ్యం

జపాన్‌ తీరానికి చేరువలో కూలిన అమెరికా వాయుసేన విమానం ‘సీవీ-22 ఓస్ప్రే’కు చెందిన శకలాలు, అందులో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సహాయ సిబ్బంది సోమవారం పేర్కొన్నారు.

Published : 05 Dec 2023 04:24 IST

మరో ఇద్దరి కోసం సముద్రంలో గాలిస్తున్న అమెరికా, జపాన్‌ బృందాలు

టోక్యో: జపాన్‌ తీరానికి చేరువలో కూలిన అమెరికా వాయుసేన విమానం ‘సీవీ-22 ఓస్ప్రే’కు చెందిన శకలాలు, అందులో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సహాయ సిబ్బంది సోమవారం పేర్కొన్నారు. ఆచూకీలేని మరో ఇద్దరు బాధితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. సాధారణ శిక్షణలో భాగంగా 8 మంది సిబ్బందితో బయల్దేరిన ఒస్ప్రే విమానం గత బుధవారం జపాన్‌లోని యకుషిమా దీవికి చేరువలో సముద్రంలో కూలిపోయింది. ఆ తర్వాత.. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగతా వారి కోసం నాటి నుంచి గాలింపు జరుగుతోంది. అమెరికా, జపాన్‌ డైవర్లు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన ముందు భాగాన్ని సోమవారం గుర్తించారు. అందులో ఐదుగురి మృతదేహాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని