అమెరికాలోని ఓ ఇంట్లో కాల్పులు

అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలో తుపాకీ కాల్పులకు అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి క్లార్క్‌ కౌంటీలోని ఒక ఇంట్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో నిందితుడు కూడా మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Published : 05 Dec 2023 04:25 IST

నిందితుడు సహా అయిదుగురి మృతి!

ఆర్కాడ్స్‌: అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలో తుపాకీ కాల్పులకు అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి క్లార్క్‌ కౌంటీలోని ఒక ఇంట్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో నిందితుడు కూడా మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం మృతుల బంధువుల్లో ఒకరికి ఘటన జరిగిన ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది. ఇంట్లో ఉన్నవారందరినీ తుదముట్టిస్తానని దుండగుడు ఫోన్‌లో హెచ్చరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఫోన్‌ వచ్చిన ఇంటికి చేరుకున్నారు. ఒక డ్రోన్‌ను లోపలకు పంపగా.. అక్కడ ఉన్న అయిదుగురూ నేలపై పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వైద్య సిబ్బందితో లోపలికి వెళ్లగా అప్పటికే అందరూ మరణించారు. నిందితుడు తొలుత అందరినీ చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని