గురి తప్పిన సైనిక డ్రోన్‌.. నైజీరియాలో 120 మంది మృతి!

నైజీరియాలో రెబల్స్‌పైకి సైన్యం ప్రయోగించిన ఒక డ్రోన్‌ గురి తప్పి పౌరులపై పడింది. ఈ ఘటనలో 120 మంది మరణించినట్లు తెలుస్తోంది. కదూనా రాష్ట్రంలోని ఇగాబీలో ఆదివారం రాత్రి ఒక మత ఉత్సవం చేసుకుంటున్న వారిపై ఆకస్మాత్తుగా డ్రోన్‌ బాంబు పడింది.

Updated : 05 Dec 2023 06:21 IST

అబూజా: నైజీరియాలో రెబల్స్‌పైకి సైన్యం ప్రయోగించిన ఒక డ్రోన్‌ గురి తప్పి పౌరులపై పడింది. ఈ ఘటనలో 120 మంది మరణించినట్లు తెలుస్తోంది. కదూనా రాష్ట్రంలోని ఇగాబీలో ఆదివారం రాత్రి ఒక మత ఉత్సవం చేసుకుంటున్న వారిపై ఆకస్మాత్తుగా డ్రోన్‌ బాంబు పడింది. సెలవు దినం కావడంతో ఉత్సవానికి భారీగా జనం వచ్చారు. దీంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది. ఇటీవల సైన్యం ప్రయోగించిన డ్రోన్లు గురి తప్పి తరచూ జనవాసాలపై పడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని