ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో భారతీయుడి మృతి

ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖుస్దీప్‌ సింగ్‌ అనే భారతీయుడు దుర్మరణం పాలయ్యారు.

Updated : 07 Dec 2023 06:28 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖుస్దీప్‌ సింగ్‌ అనే భారతీయుడు దుర్మరణం పాలయ్యారు. సోమవారం మెల్‌బోర్న్‌లోని పాల్మర్‌ రోడ్డులో ఖుస్దీప్‌సింగ్‌ వాహనం పలుమార్లు పల్టీలు కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర సేవల విభాగం అధికారులు ఆయనను తక్షణం ఆసుపత్రికి తరలించినప్పటికీ..  అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి తక్షణ కారణాలు తెలియనప్పటికీ.. డ్రైవింగ్‌లో అలసిపోయి, మగతగా ఉన్నందువల్లే కారు బోల్తా కొట్టినట్లు సమాచారం. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. తన భర్త మృతదేహాన్ని భారత్‌కు పంపడానికి సహకరించాలని ఖుస్దీప్‌ భార్య జప్నీత్‌ కౌర్‌ కోరుతున్నారు. ఇందుకోసం ‘గోఫండ్‌ మి’ పేరిట ఆన్‌లైన్‌లో నిధుల సేకరణ కార్యక్రమాన్ని కూడా ఆమె ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని