అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బుధవారం అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Updated : 07 Dec 2023 06:18 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బుధవారం అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రచారం కోసం నిధులు సేకరిస్తున్న తరుణంలో బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్దేశించి బైడెన్‌ మాట్లాడారు. ‘ట్రంప్‌ పోటీలో లేకపోతే.. నేను పోటీ చేస్తానో లేదో కచ్చితంగా తెలియదు. కానీ ఆయన్ను మాత్రం గెలవనివ్వం’ అంటూ ఒక్కసారిగా అధ్యక్ష ఎన్నికలను రసవత్తరంగా మార్చేశారు. రెండోసారి ట్రంప్‌ అధ్యక్షుడు అయితే దేశం నిరంకుశ పాలనలోకి వెళ్లే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యానించిన రిపబ్లికన్‌ సెనెటర్‌ లిజ్‌ చెనీని బైడెన్‌ అభినందించారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నాట్లు బైడెన్‌, ట్రంప్‌లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని