సూయెజ్‌ కాలువలో వంతెనను ఢీకొట్టిన రవాణా నౌక

ప్రపంచ వాణిజ్య రవాణాలో అత్యంత కీలకమైన ఈజిప్టులోని సూయెజ్‌ కాలువలో బుధవారం ఓ నౌక ప్రమాదానికి గురైంది.

Published : 07 Dec 2023 05:52 IST

కైరో: ప్రపంచ వాణిజ్య రవాణాలో అత్యంత కీలకమైన ఈజిప్టులోని సూయెజ్‌ కాలువలో బుధవారం ఓ నౌక ప్రమాదానికి గురైంది. సింగపూర్‌ నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్తున్న రవాణా నౌక సూయెజ్‌ కాలువలో ప్రయాణిస్తూ ఇస్మైలియా నగరం వద్దకు చేరుకోగానే దాని ముందుభాగంలో ఉండే రడ్డర్‌ విరిగిపోయింది. దీంతో నౌక అదుపు తప్పి మాన్సీ వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో నౌకకు, వంతెనకు ఎంతమేరకు నష్టం వాటిల్లిందనేది ప్రస్తుతానికి తెలియరాలేదని సూయెజ్‌ కాలువ ప్రాధికార సంస్థ అధిపతి అడ్మిరల్‌ ఒసామా రబీ తెలిపారు. ఇతర నౌకలు ప్రత్యామ్నాయ మార్గంలో సాఫీగా వెళ్లడంతో కాలువలో ట్రాఫిక్‌కు అంతరాయమేమీ కలగలేదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని