తొందరగా ఎదిగితే ఆరోగ్యం చిందరవందర!

పదమూడేళ్లకు ముందే రజస్వల అయిన బాలికలు నడి వయసులో టైప్‌-2 మధుమేహానికి గురయ్యే ముప్పు ఎక్కువని అమెరికన్‌ పరిశోధకులు కనుగొన్నారు.

Published : 07 Dec 2023 05:58 IST

దిల్లీ: పదమూడేళ్లకు ముందే రజస్వల అయిన బాలికలు నడి వయసులో టైప్‌-2 మధుమేహానికి గురయ్యే ముప్పు ఎక్కువని అమెరికన్‌ పరిశోధకులు కనుగొన్నారు. పదేళ్లకు ముందే రజస్వల అయితే మధుమేహంతోపాటు 65 ఏళ్లలోగా పక్షవాతానికీ గురయ్యే ప్రమాదం రెండు రెట్లు అధికమని తేల్చారు. 20 నుంచి 65 ఏళ్ల మధ్య వయసులోని 17 వేల మంది యువతులు, మహిళలను పరిశీలించి ఈ అంశాలను నిర్ధారించారు. త్వరగా రజస్వల అయితే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ కూడా త్వరగా విడుదలైందని అర్థం. అంటే వీరు సాధారణ వనితలకన్నా ఎక్కువ కాలం ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ప్రభావానికి గురవుతారు. ఇది శీఘ్రంగా మధుమేహానికీ, హృదయ సంబంధ వ్యాధులకూ ఎర అయ్యే ప్రమాదాన్ని పెంచి ఉండవచ్చని పరిశోధకుల అంచనా. అధిక బరువు కూడా ఈ ప్రమాదానికి దారితీయవచ్చు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మహిళల్లో జీవక్రియ, హృదయ సంబంధ వ్యాధులకు సమగ్ర చికిత్సా విధానాలను రూపొందించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని