హఫీజ్‌ అనుచరుడు అద్నాన్‌ అహ్మద్‌ కాల్చివేత

వరుసగా జరుగుతున్న హత్యలతో పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.

Published : 07 Dec 2023 05:58 IST

ఇస్లామాబాద్‌: వరుసగా జరుగుతున్న హత్యలతో పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గత కొంతకాలంగా కీలక ఉగ్ర నేతలు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. తాజాగా లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ అనుచరుడు అద్నాన్‌ అహ్మద్‌ను కొందరు వ్యక్తులు కాల్చిచంపారు. కరాచీలో డిసెంబరు 2వ తేదీ అర్ధరాత్రి.. అద్నాన్‌ ఇంటి బయట ఉండగా కాల్పులు జరిపినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అద్నాన్‌ను పాక్‌ ఆర్మీ రహస్యంగా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అద్నాన్‌ చనిపోయినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. 2015లో జమ్మూకశ్మీర్‌లోని ఉదంపుర్‌లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి అద్నాన్‌ సూత్రధారి. ఆ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అమరులవగా.. 13 మంది గాయపడ్డారు. 2016లో కశ్మీర్‌లోని పాంపోర్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ ఇతడు కీలకపాత్ర పోషించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని