గాజా సంక్షోభంతో ప్రపంచానికి ముప్పు

గాజా సంక్షోభంపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ అనూహ్యంగా స్పందించారు. యూఎన్‌ చార్టర్‌లో సెక్రటరీ జనరల్‌కు విశేషాధికారాలు కల్పించే అధికరణం 99ను ఉపయోగిస్తూ.. ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు.

Published : 08 Dec 2023 04:40 IST

విశేష అధికారాన్ని ఉపయోగించి భద్రతా మండలికి ఐరాస సెక్రటరీ జనరల్‌ లేఖ
మండిపడిన ఇజ్రాయెల్‌

ఐక్యరాజ్యసమితి(ఐరాస): గాజా సంక్షోభంపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ అనూహ్యంగా స్పందించారు. యూఎన్‌ చార్టర్‌లో సెక్రటరీ జనరల్‌కు విశేషాధికారాలు కల్పించే అధికరణం 99ను ఉపయోగిస్తూ.. ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. అందులో గాజాలో జరుగుతున్న మానవ సంక్షోభానికి ముగింపు పలకాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు భద్రతా మండలి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ యుద్ధం ప్రపంచానికి ముప్పు అని పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు ముప్పు తలెత్తినప్పుడు అధికరణం 99ను ఉపయోగించి సమస్యను భద్రతా మండలి దృష్టికి తీసుకువెళ్లే విశేషాధికారం ఐరాస సెక్రటరీ జనరల్‌కు ఉంటుంది. దీన్ని అరుదుగా వినియోగిస్తారు. 2017లో సెక్రటరీ జనరల్‌ బాధ్యతలు స్వీకరించిన గుటెరస్‌... ఈ అధికరణాన్ని వినియోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనిపై ఇజ్రాయెల్‌ తీవ్రస్థాయిలో స్పందించింది. నైతికంగా గుటెరస్‌ మరింత దిగజారారని ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని