టైప్‌ 1 మధుమేహానికి కీళ్లవాతం మందు

కీళ్ల వాతానికి వాడే బారిసిటినిబ్‌ మందు ఇన్సులిన్‌ ఆధారిత టైప్‌ 1 మధుమేహాన్ని నియంత్రించగలదని ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

Published : 08 Dec 2023 04:40 IST

దిల్లీ: కీళ్ల వాతానికి వాడే బారిసిటినిబ్‌ మందు ఇన్సులిన్‌ ఆధారిత టైప్‌ 1 మధుమేహాన్ని నియంత్రించగలదని ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగిన 100 రోజుల్లోనే ఈ మందును వాడితే శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి ప్రక్రియను అది పరిరక్షిస్తుందని, టైప్‌ 1 మధుమేహ పురోగతిని నిరోధిస్తుందని తేలినట్లు వారు తెలిపారు. టైప్‌ 1 మధుమేహం ఉన్నట్లు గుర్తించిన తొలిరోజుల్లో శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి కణాలు గణనీయ సంఖ్యలోనే ఉంటాయని, అవి మరింతగా నాశనం కాకుండా బారిసిటినిబ్‌ మందు కాపాడుతుందని కనుగొన్నారు. దీని వినియోగంతో బాధితులు తక్కువ మోతాదు ఇన్సులిన్‌తోనే జీవితం గడపగలుగుతారని పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని