బీబీసీ ఛైర్మన్‌గా సమీర్‌ షా

బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) ఛైర్మన్‌ పదవికి భారత్‌లో జన్మించిన డాక్టర్‌ సమీర్‌ షా (71)ను ప్రభుత్వం ఎంపిక చేసింది.

Published : 08 Dec 2023 05:42 IST

లండన్‌: బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) ఛైర్మన్‌ పదవికి భారత్‌లో జన్మించిన డాక్టర్‌ సమీర్‌ షా (71)ను ప్రభుత్వం ఎంపిక చేసింది. జర్నలిజం, టీవీ కార్యక్రమాల నిర్మాణంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్‌ షా స్వతంత్ర టీవీ, రేడియా కార్యక్రమాల సంస్థ జూనిపర్‌ సీఈవో కూడా. ఇంతకుముందు బీబీసీలో వివిధ హోదాల్లో ఈయన పనిచేశారు. బీబీసీ రాజకీయంగా స్వతంత్ర సంస్థ అయినా, దాని ఛైర్మన్‌ను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సమీర్‌ షా వంటి పాత్రికేయుడిని ఈ పదవిలో నియమించడం ఇదే ప్రథమం. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ (ఔరంగాబాద్‌)లో 1952లో సమీర్‌ షా జన్మించారు. తల్లి ఉమ ఆయన్ను తీసుకొని 1960లో లండన్‌ వెళ్లి స్థిరపడ్డారు. షా కుటుంబం బాలీవుడ్‌ సినిమాలు నిర్మించేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని