మార్చి 17న రష్యా ఎన్నికలు.. పోటీపై ఇంకా పెదవి విప్పని పుతిన్‌

రష్యా అధ్యక్ష ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్టసభ సభ్యులు గురువారం నిర్ణయించారు.

Updated : 08 Dec 2023 05:57 IST

మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్టసభ సభ్యులు గురువారం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీంతో ఐదోసారి అధికారాన్ని చేపట్టేందుకు పుతిన్‌కు మార్గం సుగమం అయినట్లే అని భావిస్తున్నారు. పుతిన్‌ రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుత ఆరేళ్ల పదవీకాలం 2024లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వీలు కల్పించే ఒక చట్టాన్ని ఇటీవల తీసుకువచ్చారు. దీనివల్ల ఆయన 2036 వరకూ ఆ పదవిలో కొనసాగేందుకు వీలు కలుగుతుంది. అయితే 2024 ఎన్నికల్లో  పోటీ చేయడంపై పుతిన్‌ (71) ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని