ఇక ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ తప్పనిసరి

ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌లో సందేశాలు, కాల్స్‌కు ఇకపై ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను తప్పనిసరి (డిఫాల్ట్‌) చేస్తున్నట్లు దాని మాతృసంస్థ మెటా గురువారం ప్రకటించింది.

Updated : 08 Dec 2023 05:51 IST

న్యూయార్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌లో సందేశాలు, కాల్స్‌కు ఇకపై ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను తప్పనిసరి (డిఫాల్ట్‌) చేస్తున్నట్లు దాని మాతృసంస్థ మెటా గురువారం ప్రకటించింది. హ్యాకర్లు, ఇతర నేరగాళ్ల నుంచి వినియోగదారులకు ఇది రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అందుబాటులోకి వస్తే.. సెండర్‌, రిసిపియెంట్‌ మినహా మరెవరూ సందేశాలను చదవలేరు. మెటాకు కూడా వాటిని అర్థం చేసుకోవడం వీలు కాదు. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో 2016లోనే ఎన్‌క్రిప్టెడ్‌ చాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. అప్పటికి అది ఐచ్ఛికం మాత్రమే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని